KTR Interesting Comments : తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసింది పాట‌లే

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Interesting Comments

Hello Telugu - KTR Interesting Comments

KTR : హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసింది సాంస్కృతిక కార్య‌క్ర‌మాలేనని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పాట ఒక ఆయుధంగా మారింద‌ని, కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను ఉద్య‌మం వైపు, పోరాటం చేసేలా చోద‌క శ‌క్తిగా మార్చేలా చేసింద‌న్నారు. వేలాది మంది క‌ళాకారులు త‌మ ప్ర‌తిభా నైపుణ్యాల‌కు ప‌దును పెట్టింద‌న్నారు. ఇందులో భాగంగా తమ స‌ర్కార్ హ‌యాంలో పెద్ద ఎత్తున ప్ర‌యారిటీ ఇచ్చామ‌న్నారు కేటీఆర్ (KTR). గురువారం హైద‌రాబాద్ లోని నందిన‌గ‌ర్ నివాసంలో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ విద్యార్థి విభాగంలో ఆధ్వ‌ర్యంలో రూపొందించిన పాట‌ను ఆవిష్క‌రించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ . బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో రూపొందించారు దీనిని.

KTR Key Comments on Songs

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్, బీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్ గౌడ్, మిథున్ ప్రసాద్, సంతోష్, సింగర్స్ మద్దెల సందీప్ గౌడ్, మానుకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పాట‌ను త‌యారు చేసినందుకు విద్యార్థి విభాగాన్ని అభినందించారు. ఈనెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించే దీక్షా దివ‌స్ ను స‌క్సెస్ చేయాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్.

Also Read : CM Chandrababu Strong Focus : రాజ‌ధాని రైతుల స‌మ‌స్యలు ప‌రిష్క‌రించాలి

Exit mobile version