CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నగరం కోసం స్వచ్చంధంగా భూములు ఇచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఆర్డేఏపై కీలక సమీక్ష చేపట్టారు సీఎం. ఈ సందర్బంగా పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా రాజధాని కంటే దీని కోసం తమ స్వంత భూములు ఇచ్చిన అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యమన్నారు. వారికి ఏం కావాలో ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూస్తామని, ఆ బాధ్యత నాదేనని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. కూటమి సర్కార్ ఏ ఒక్కరికీ అన్యాయం చేయదని తెలిపారు.
CM Chandrababu Comments
ప్రధానంగా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సూచించారు. భూములు త్యాగం చేసి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం తరపున అదే స్థాయి సహకారం అందాలని కుండ బద్దలు కొట్టారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రైతులకు న్యాయం చేసేందుకు సీఎం కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు.
Also Read : R Ashwin Sensational Comments : కీవీస్ తో ఓటమే నా రిటైర్మెంట్ కు కారణం
