KTR Fired on CM Revanth Reddy : సైన్యంపై సీఎం కామెంట్స్ కేటీఆర్ సీరియ‌స్

బేష‌ర‌తుగా వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

hellotelugu-KTR

KTR : హైద‌రాబాద్ : భారత సైన్యంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). దేశం కోసం రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్న సైనికుల గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపై మండిప‌డ్డారు. యూనిఫామ్ ధరించిన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్ట పడుతున్నారు కాబట్టే, మనం సురక్షితంగా ఉంటూ, రాజకీయాలు చేసుకో గలుగుతున్నాం అన్నారు. ఆ సోయి లేకుండా సీఎం నీచాతి నీచంగా కామెంట్స్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఆర్మీ సరిహద్దుల్లో ఉండడం వల్లనే సాధారణ జీవితాన్ని గడప గలుగుతున్నాం అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డికి సరికాదని పేర్కొన్నారు.

KTR Slams CM Revanth Reddy

ఇప్పటికే తన కామెంట్స్‌తో నీచమైన స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి, ఎన్నికల లబ్ధి కోసం ఆర్మీపై కామెంట్స్ చేసి మరింతగా తన స్థాయి దిగజార్చుకున్నాడ‌ని ఎద్దేవా చేశారు. భారత సైన్యాన్ని కించపరిచి, పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారని ప్ర‌శ్నించారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డికి గుండాలు, రౌడీషీటర్లు అంటేనే గౌరవం అని, దేశం కోసం శ్ర‌మించే సైనికులంటే గౌరవం లేద‌న్నారు. అలాంటి రేవంత్ రెడ్డి శత్రుదేశాన్ని గౌరవించడం ఆశ్చర్యమేమీ లేదన్నారు కేటీఆర్. ఇప్పటికైనా సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డి ఆపాలని హిత‌వు ప‌లికారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకైనా ఇక నుంచైనా మర్యాదగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు.

Also Read : Hydraa Huge Land Saved : రూ. 300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Exit mobile version