KTR : హైదరాబాద్ – ప్రపంచంలోనే అత్యద్భుతంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఈ సందర్బంగా ఆయన పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ NDA ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండో సారి కొట్టుకు పోయినా ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం లోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్-బీజేపీ నేతలకు “పోలవరంను.. కూలవరం” అనే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు..తీవ్రంగా నిలదీశారు.
KTR Key Comments
తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే NDSA ను దించి బీఆర్ఎస్ పై బురజల్లిన బీజేపీ నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకు పోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ ను గుట్టు చప్పుడు కాకుండా ఏపీలో యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్ కు దిక్కు లేక పోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం తప్ప మరోటి కాదన్నారు.
2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకు పోయినా ఇప్పటికీ ఊలుకూ లేదు, పలుకూ లేదన్నారు . మరోసారి ఏపీలో పోలవరం కాఫర్ డ్యామ్ గోదావరి పాలైనా, ఇటు తెలంగాణలో ఎస్.ఎల్.బీ.సీ. టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్.డి.ఎస్.ఏ అడ్రస్ లేదు ఎందుకని ఫైర్ అయ్యారు.
Also Read : Minister Atchannaidu Interesting : ఉద్యమాల నిప్పుకణిక సర్ధార్ గౌతు లచ్చన్న
