Minister Atchannaidu : విజయవాడ – గౌతు లచ్చన్న పదవులు కోసం కాకుండా ప్రజల కోసం పోరాడారని అందుకే ఆయనను నేటికీ ఉద్యమాల నిప్పుకణికగా గౌరవంగా స్మరించుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అన్నారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు లచ్చన్న చేసిన పోరాటాలు, రైతు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన నిరసనలు, నిరాహార దీక్షలు, రైలురోకోలు ఆయన ధైర్య సాహసాలకు నిదర్శనమని అన్నారు. గౌతు లచ్చన్న 116 జయంతిని రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిది. ఈ కార్యక్రమానికి హజరై సర్థార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళి అర్పించారు.
Minister Atchannaidu Key Comments
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గౌతు లచ్చన్న పేరు ఒక అజరామరం అన్నారు. సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు లచ్చన్న అని అన్నారు. తెలుగునాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన రోజుల నుండే ఆయన జీవితానికి ఉద్యమాలే పునాది. సాదాసీదా కుటుంబంలో పుట్టినా, లక్ష్యమున్న నాయకుడిగా ఎదిగి, న్యాయం కోసం కఠినంగా నిలబడిన “సర్ధార్” అన్న బిరుదును ప్రజలే అందచేశారని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పటికీ మాయమవని ఒక వెలుగు దీపంలా ఆయన కీర్తి నిలిచి పోయిందని, నిజాయితీ, అంకితభావం, ధైర్యం ఈ మూడు గౌతు లచ్చన్న వ్యక్తిత్వానికి ప్రతిరూపాలని అన్నారు.
ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన లచ్చన్న , యావత్ జాతికి ఒక స్ఫూర్తి ప్రదాత అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత్వం బలంగా స్థిరపడతాయి. ఆయన ఆలోచనలు, ఆయన పోరాట పటిమ కొత్త తరానికి ప్రేరణగా నిలుస్తాయి. ఆధునికత, గ్లోబలైజేషన్ ప్రభావంతో మారుతున్న విలువల మధ్య యువతకు దిశా నిర్దేశం కావలసిన సమయం ఇది అన్నారు మంత్రి. అలాంటి సందర్భంలో గౌతు లచ్చన్న జీవితం ఒక మార్గదర్శక దీపం. ఆయన కృషి ద్వారా సమాజం కోసం త్యాగం అంటే ఏమిటో, నిజమైన ప్రజాసేవ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. సమాజంలో శాశ్వత మార్పు రావాలంటే త్యాగం, పట్టుదల, నిజాయితీతో కూడిన నాయకత్వం అవసరం అన్నారు. ఆయన జీవితమంతా పేదల కోసం, కూలీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం అంకితం చేశారన్నారు.
Also Read : MP Appalanaidu – Stree Sakthi Interesting : స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు దర్పణం
