MLA KTR Warning : ఇండియాకి హిందీ భాష అవ‌స‌రం లేదు

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - MLA KTR Warning

Hello Telugu - MLA KTR Warning

KTR : హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. హిందీ మాట్లాడే వారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదన్నారు. తెలుగు భాషను జాతీయ భాష చేయాలని నేను ప్రతిపాదిస్తే మీరు ఒప్పుకుంటారా అని ప్ర‌శ్నించారు. 70-80 ఏళ్ళు దేశం బాగుంటే, మళ్లీ జాతీయ భాష ఎందుకు అని నిల‌దీశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కులం పేరుతో, మ‌తం పేరుతో ప్రాంతాల పేరుతో విడ‌దీయ‌డం బీజేపీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ఒక అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు.

KTR Comments

దేశానికి 75 ఏళ్ల‌కు పైగా అయ్యింది స్వేచ్ఛ ల‌భించి. ఇప్ప‌టికీ ఇంకా 143 కోట్ల మంది భార‌తీయుల‌పై హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దుతామ‌ని అనుకుంటే చెల్ల‌ద‌న్నారు కేటీఆర్ (KTR). ఇది భారత రాజ్యాంగానికి, ప్ర‌జా స్వామ్య స్పూర్తిగా విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అన్ని భాష‌ల‌ను గౌర‌వించాల‌ని, లేక పోతే మ‌నుగ‌డ ఉండ‌ద‌ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు కేటీఆర్.

ఇప్ప‌టికే అన్ని వ్య‌వస్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చాల‌క భాష పేరుతో పెత్త‌నం చెలాయించాల‌ని చూస్తే తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి. భార‌త దేశం అంటేనే లౌకిక రాజ్య‌మ‌ని, దీనిని గౌర‌వించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు . ఇక‌నైనా మోదీ, అమిత్ షా త‌మ అభిప్రాయాల‌ను రుద్దాల‌ని చేయొద్ద‌ని పేర్కొన్నారు.

Also Read : Chinta Mohan Innovative : ద‌ళితులు వ్యాపార‌స్థులుగా ఎద‌గాలి – చింతా మోహ‌న్

Exit mobile version