Chinta Mohan Innovative : ద‌ళితులు వ్యాపార‌స్థులుగా ఎద‌గాలి – చింతా మోహ‌న్

ఆర్థికంగా ఎదిగితేనే రాజకీయ ప‌రంగా గుర్తింపు ఉంటుంది

Hello Telugu - Chinta Mohan Innovative

Hello Telugu - Chinta Mohan Innovative

Chinta Mohan : ఒంగోలు జిల్లా – మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ (Chinta Mohan) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒంగోలులో మాల ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ప్ర‌సంగించారు. దళితులు వ్యాపారాలు చేయాలి. డబ్బు సంపాదించాలి. ఆర్థికంగా ఎదగాలన్నారు . చదువులకు విలువలేదు. ఉద్యోగాలు చేస్తే మహా అయితే రిటైర్డ్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. పిల్లలను చదివించు కోవచ్చు అంతే అన్నారు. వ్యాపారాలు చేయడం వల్ల ఆర్థికంగా ఎదగొచ్చు. ఆర్థికంగా ఎదిగితే అధికారం మనదేన‌ని అన్నారు. చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల రైతు. ఆర్థికంగా ఎదిగాడు. కారణం అధికారం ఉండ‌డం వ‌ల్ల‌నేన‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

Ex Union Minister Chinta Mohan Comments

వైయస్ రాజశేఖర్ రెడ్డి తన కొడుకును బిలినియర్ చేశాడని, దాన్ని జగన్ (YS Jagan) నాలుగింతలు పెంచుకున్నాడని ఆరోపించారు. మనలో ఐక్యత కావాలి. మనలో మనకు ఎన్ని ఉన్నా, మనసు చంపుకునైనా, ఐక్యత ఉందనే మాట బయటికి తీసుకు రావాల‌ని పిలుపునిచ్చారు చింతా మోహ‌న్.
1992 డిసెంబర్ 10వ తేదీ, మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో పీవీ నరసింహారావు ఇంట్లో ఎస్సీ వర్గీకరణకు బీజం పడ్డద‌ని గుర్తు చేశారు.

కాన్సీరాం , ములాయం సింగ్ యాదవ్ ఇరువురినీ, 1992, డిసెంబర్ 10వ తేదీ, ఢిల్లీలో మా ఇంటికి విందుకు వచ్చారని తెలిపారు. పాయసం, వడ, చికెన్ పెట్టి, ఢిల్లీ ప్రెస్ క్లబ్ కు ఇద్ద‌రితో సంయుక్త ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించానని చెప్పారు..

500 మంది జర్నలిస్టులు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చారని, 1993లో ఎన్నికలు జరిగాయి. SP, BSP కలయిక వల్ల, మూలయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. అప్పటి నుంచి కాన్షిరాం దేశమంతా, ఊరూరు తిరగడం ప్రారంభించారని తెలిపారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగాడు. ప్రకాశం జిల్లాకు వచ్చాడు. పెద్ద సభ జరిగింది. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయబట్టే, నేడు భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషల ప్రజలు కలిసి ఉన్నారని ఆ జడ్జీలు నాతో అన్నారు.

అంబేద్కర్ వంటి తెలివైన వ్యక్తి భారతదేశంలో ఇప్పటి దాకా పుట్టలేదు. ఇకపై పుట్టక పోవచ్చు!!? అని సమయస్ఫూర్తితో చెప్పారు.

Also Read : MP Midhun Reddy – Liquor Scam : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్

Exit mobile version