KTR Interesting Comments : ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా సూప‌ర్ : కేటీఆర్

గ్రావ్ట‌న్ మోటార్స్ సీఈఓ ప‌రుశురామ్ పాక‌కు ప్ర‌శంస‌

Hello Telugu - KTR Interesting Comments

Hello Telugu - KTR Interesting Comments

KTR : హైద‌రాబాద్ : యువ‌త త‌లుచుకుంటే ఏమైనా సాధించ గ‌ల‌ద‌ని నిరూపించారు తెలంగాణకు చెందిన ప‌రుశురామ్ పాక‌. ఈ సంద‌ర్బంగా తెలంగాణ ఈవీ ఆవిష్కరణలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్ మోటార్స్‌ వ్యవస్థాపకుడు ప‌రుశురాం పాక‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన‌ సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు , సీఈఓ పరశురాం పాకను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఒక ఆవిష్కర్తకు ప్రేరణనిచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. పరశురామ్ పాక వంటి ప్రతిభావంతులను పోషించడంలో తెలంగాణలోని ఆవిష్కరణల కేంద్రాలైన టీ-హబ్, టీ-వర్క్స్ పాత్ర కీలకంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

KTR Key Comments

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సిరిసిల్లకు చెందిన పరశురాం పాక ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. ఇంజనీరింగ్‌ నేపథ్యం, అమెరికాలో అనుభవం ఉన్న త‌ను ఇంక్యుబేటర్ల వ‌ద్ద‌ ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావ్టన్ మోటార్స్‌ను స్థాపించారు. ఇవాళ‌ ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. గ్రావ్టన్ మోటార్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్‌ను పూర్తిగా దేశీయంగా రూపొందించి తయారు చేసిందని మాజీ మంత్రి తెలిపారు. ఇది నిజమైన ‘మేడ్-ఇన్-ఇండియా, మేడ్-ఫర్-ది-వరల్డ్’ విజయగాథ అని ఆయన అభివర్ణించారు. త‌ను సాధించిన ఈ విజ‌యం ల‌క్ష‌లాది మందికి స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. యువ‌త‌లో దాగి ఉన్న ప్ర‌తిభ‌ను వెలికి తీయాల‌ని, క‌ష్ట‌ప‌డితే స‌క్సెస్ వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

Also Read : Deputy CM Pawan Strong Focus : కాలుష్య నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక

Exit mobile version