Deputy CM Pawan Strong Focus : కాలుష్య నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక

తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోక‌స్

Hello Telugu - Deputy CM Pawan Strong Focus

Hello Telugu - Deputy CM Pawan Strong Focus

Deputy CM Pawan : అమ‌రావ‌తి : పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, నివారణకు అనుసరించాల్సిన ప్రణాళికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan) స్పష్టం చేశారు. ఇటీవల ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్న క్రమంలో అక్కడి పరిస్థితులపై తక్షణం అధ్యయనం చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమస్య ఉన్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. అందుకోసం అనుసరించాల్సిన విధి విధానాలపై పలు సూచనలు చేశారు.

Deputy CM Pawan Kalyan Key Comments

మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసే 100 రోజుల ప్రణాళికను తక్షణం అమలు చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు తీసుకోబోయే చర్యలు ఒక మోడల్ గా దేశం మొత్తం పాటించే విధంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో తీర ప్రాంత కాలుష్యం, పారిశ్రామిక వ్యర్దాల నిర్వహణపై స‌మీక్ష చేప‌ట్టారు. పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత, కాకినాడలో మత్స్యకారులతో జరిగిన ‘మాట.. మంతి’ కార్యక్రమంలో మత్స్యకారులు ప్రస్తావించిన సమస్యలు, తదితర అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చాయి.

Also Read : Modi Govt Important Update : తెలంగాణలో హ్యామ్ రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Exit mobile version