KTR Strong Demand For Bus Fare : పెంచిన బ‌స్సు ఛార్జీలు వెన‌క్కి తీసుకోవాలి : కేటీఆర్

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని క‌లిసిన మాజీ మంత్రులు

Hello Telugu - KTR Strong Demand For Bus Fare

Hello Telugu - KTR Strong Demand For Bus Fare

KTR : హైద‌రాబాద్ : అడ్డ‌గోలుగా పెంచిన ఆర్టీసీ ఛార్జీల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రులు కేటీఆర్, త‌న్నీరు హ‌రీశ్ రావు, మాజీ స్పీక‌ర్ ప‌ద్మా రావు గౌడ్, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో బ‌స్సు ఛార్జీలు త‌గ్గించాల‌ని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛలో బ‌స్ భ‌వ‌న్ కు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున బ‌స్ భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు గులాబీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా చొచ్చుకు పోయేందుకు ప్ర‌య‌త్నం చేశారు మాజీ మంత్రులు. అనంత‌రం వారిని త‌న వ‌ద్ద‌కు క‌లిసేందుకు అనుమ‌తి ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నాగి రెడ్డి.

KTR Key Comments on Bus Fare

ఆర్టీసీ ఎండీతో కేటీఆర్ (KTR), హ‌రీశ్ రావు మాట్లాడారు. భారీ ఎత్తున ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఛార్జీలు పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఛార్జీల పెంపు వ‌ల్ల అత్య‌ధికంగా పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై భారం ప‌డుతుంద‌ని తెలిపారు. వెంట‌నే పెంచిన ఛార్జీల‌ను త‌గ్గించాల‌ని కోరారు. ఈ మేర‌కు ప‌లు డిమాండ్ల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని ఎండీ నాగి రెడ్డికి స‌మ‌ర్పించారు. పార్టీ తరపున లేఖ అందజేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు. ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగారు నేత‌లు. మహాలక్ష్మి పథకం కిందరూ. 1353 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్ల‌డించారు ఎండీ నాగి రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 9246 కోట్లు ఆర్టీసీకి గ్రాంట్‌ రూపంలో విడుదల చేసినట్టు తెలిపారు కేటీఆర్, హ‌రీశ్ రావు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తోంద‌ని వాపోయారు.

Also Read : BRS Party Shocking Decision : బీఆర్ఎస్ ఛ‌లో బస్ భ‌వ‌న్ ఉద్రిక్తం

Exit mobile version