BRS Party Shocking Decision : బీఆర్ఎస్ ఛ‌లో బస్ భ‌వ‌న్ ఉద్రిక్తం

స‌ర్కార్ కాదిది స‌ర్క‌స్ న‌డుపుతోంది

Hello Telugu - BRS Party Shocking Decision

Hello Telugu - BRS Party Shocking Decision

BRS Party : హైద‌రాబాద్ : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిర‌సిస్తూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆధ్వ‌ర్యంలో గురువారం భారీ ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీగా బ‌స్ భ‌వ‌న్ వ‌ద్ద‌కు చేరుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు మోహ‌రించారు. బీఆర్ఎస్ నేత‌లు కేటీఆర్, హ‌రీశ్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బ‌స్సుల‌లో బ‌య‌లు దేరారు. ఎక్క‌డిక‌క్క‌డ వారిని అరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ సంద‌ర్బంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తాము ఫ్రీ బ‌స్సు ప‌థ‌కానికి వ్య‌తిరేకం కాద‌న్నారు. కానీ ప్రైవేట్ ప‌రం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో స‌ర్కార్ న‌డ‌వ‌డం లేద‌ని స‌ర్క‌స్ న‌డుపుతున్నారంటూ మండిప‌డ్డారు.

BRS Party Key Decision

బీఆర్ఎస్ పార్టీ ‘ఛలో బస్ భవన్’ కు పిలుపునిస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు . ఇది అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం అన్నారు. నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారని నిల‌దీశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా అని మండిప‌డ్డారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశార‌ని ఆరోపించారు. ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి అని మండిప‌డ్డారు.

Also Read : MLA Harish Rao Fired on CM Revanth Govt : మొక్క‌జొన్న రైతులపై కాంగ్రెస్ స‌ర్కార్ వివ‌క్ష

Exit mobile version