KTR Strong Demand : సంక్షేమ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల అద్దెలు చెల్లించాలి

రాష్ట్ర స‌ర్కార్ ను డిమాండ్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Strong Demand

Hello Telugu - KTR Strong Demand

KTR : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని గురుకుల సంక్షేమ పాఠశాలలకు భవన అద్దెలు చెల్లించక పోవడం దారుణ‌మ‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అసమర్థతను బయట పెట్టింద‌న్నారు. విద్యా శాఖను కూడా కలిగి ఉన్న త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై ఆలోచించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. స‌ర్కార్ వ‌చ్చి ఇన్ని నెల‌లు అయినా ఇప్ప‌టి వ‌ర‌కు సంవ‌త్స‌రం దాటినా సంక్షేమ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల అద్దెలు చెల్లించ లేద‌ని ఆరోపించారు. దీంతో విద్యార్థుల‌ను, టీచ‌ర్ల‌ను గెంటి వేసే ప్ర‌మాద నెల‌కొంద‌న్నారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

KTR Demand

ఆనాడు అన్ని శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి ఒక‌టో తారీఖునే వేత‌నాలు చెల్లిస్తామ‌ని చెప్పార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు క‌స్తూర్బా గాంధీ పాఠశాల‌లో ప‌నిచేస్తున్న వారికి జీతాలు చెల్లించ లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా మాజీ సీఎం కేసీఆర్ త‌యారు చేసిన సంక్షేమ పాఠ‌శాల‌ల వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయాల‌నే దానిపై ఫోక‌స్ పెట్టాడంటూ సీఎంపై మండిప‌డ్డారు. లక్షలాది మంది పేద విద్యార్థుల జీవితాలను మార్చిన గురుకుల పాఠశాలలను లాక్ చేయడం తెలంగాణ పాలనలో ఒక చీకటి అధ్యాయమని కెటిఆర్ పేర్కొన్నారు. అద్దె భ‌వ‌నాల య‌జ‌మానులు తాళాలు వేసే ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఏకకాలంలో నిలిపి వేసిందని, తద్వారా వేలాది మంది విద్యార్థులను అనిశ్చితిలోకి నెట్టిందని మండిప‌డ్డారు.

Also Read : Mumbai High Court Shocking : శిల్పా, కుంద్రాలు రూ. 60 కోట్లు డిపాజిట్ చేయాలి

Exit mobile version