Mumbai High Court Shocking : శిల్పా, కుంద్రాలు రూ. 60 కోట్లు డిపాజిట్ చేయాలి

ముంబై హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు

Hello Telugu - Mumbai High Court Shocking

Hello Telugu - Mumbai High Court Shocking

Mumbai High Court : ముంబై : బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టి శిల్పా శెట్టి, భ‌ర్త రాజ్ కుంద్రాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ముంబైకి చెందిన హైకోర్టు (Mumbai High Court). త‌క్ష‌ణ‌మే రూ. 60 కోట్లు డిపాజిట్లు చేయాల‌ని స్ప‌ష్టంగా ఆదేశించింది. త‌మ‌ను మోసం చేశారంటూ ఓ వ్యాపార‌వేత్త ఆరోపిస్తూ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల‌పై కేసు న‌మోదైంది. విచార‌ణ‌లో భాగంగా భార్య భ‌ర్త‌ల‌ను విదేశాల‌కు వెళ్ల‌కుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీనిని స‌వాల్ చేస్తూ రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలు త‌మ‌కు దేశం విడిచి వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు ధ‌ర్మాస‌నం. ఇందులో భాగంగా రూ. 60 కోట్లు జ‌మ చేయాల్సిందేనని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

Mumbai High Court Sensational Comments

రుణం, పెట్టుబడి ఒప్పందంలో వ్యాపారవేత్త దీపక్ కొఠారిని దాదాపు రూ.60 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలపై శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ఆగస్టు 14న ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు తమపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ నిలిపి వేయాలని కోరారు. ఈ జంట గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2015 నుండి 2023 మధ్య, తమ కంపెనీ బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 60 కోట్లు పెట్టుబడి పెట్టమని వారు తనను ప్రేరేపించారని, కానీ ఆ మొత్తాన్ని వారి స్వంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపించారు కొఠారి. మోసం కేసులో ఈ జంట నిందితులుగా ఉన్నప్పుడు విశ్రాంతి ప్రయాణాలను అనుమతించ లేమని చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన బెంచ్ స్ప‌ష్టం చేసింది.

Also Read : CM Nitish Kumar Important Update : బీహార్ ఎన్డీఏలో ఎలాంటి విభేదాలు లేవు

Exit mobile version