KTR : హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ పై స్పందించారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదన్నారు. గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదని అనుకుంటున్నానని పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా కేటీఆర్ (KTR) కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది . అజారుద్దీన్ క్రికెట్ లో బాగా కట్ లు కొట్టే వారని, కానీ ఇప్పుడు తనకే పార్టీలో పెద్ద కట్ పెట్టారంటూ ఎద్దేవా చేశారు. అజారుద్దీన్ ను సంతృప్తి పరిచేందుకు, ముస్లింల ఓట్ల కోసం ఎమ్మెల్సీ అని ప్రకటించారు తప్పా తనపై ప్రేమతో చేసింది కాదన్నారు. దీంతో అజారుద్దీన్ త్రిశంకు స్వర్గంలో మిగిలి పోయారని పేర్కొన్నారు.
KTR Shocking Comments
సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్ అండ్ టి వాళ్లను ఫండ్స్ కావాలంటూ భయ పెట్టాడని , వారు ఒప్పుకోక పోవడంతో ఇబ్బందులకు గురి చేశాడన్నారు. దీంతో తాము మెట్రో రైలు నడపలేమంటూ కేంద్రానికి లేఖ రాశారన్నారు కేటీఆర్. ఈ కార్ రేస్ ఏసీబీ కేసులో ఏ 4 గా గ్రీన్ కో పైన కేసు వేయలేదని స్పష్టం చేశారు. గ్రీన్ కో దగ్గర ముడుపుల కోసమే వారిపై కేసు లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతున్నదని మండిపడ్్డారు.రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. గతంలో అనేక వివాదాలు ఉన్న ఎమ్మార్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మ బోతున్నాడని జోష్యం చెప్పారు.
Also Read : TG High Court Fired on IAS : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు వారెంట్ జారీ
