TG High Court : హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై మండిపడింది. ఒక బాధ్యత కలిగిన అధికారి ఇలాగేనా వ్యవహరించేది అంటూ నిప్పులు చెరిగింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కలెక్టర్ ఏం చూసుకుని ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు పాటించక పోవడం పట్ల ఫైర్ అయ్యింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కారం కింద తనకు వారెంట్ జారీ చేసింది హైకోర్టు. తాజాగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇతర జిల్లాల కలెక్టర్లకు కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది.
TG High Court Slams Siricilla Collector
ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్లాకు చెందిన బాధితుడు వేల్పుల ఎల్లయ్య హైకోర్టును (TG High Court) ఆశ్రయించాడు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తను కట్టుకున్న ఇంటిని కోల్పోయాడు. దీంతో ఇతరులకు పరిహారం ఇచ్చింది సర్కార్. కానీ తనకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని, ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్ ను కలిసినా పట్టించు కోవడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. తక్షణమే పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశించినా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్టించుకోలేదు.
దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం కలెక్టర్ ఇందుకు సంబంధించి వివరణ కూడా ఇవ్వక పోవడాన్ని తీవ్రంగా పరిణించింది. తనకు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం తన పనితీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఝాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Teenmar Mallanna Fired on Congress Govt : పని చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా
