Konda Surekha : హైదరాబాద్ – మంత్రి కొండా సురేఖ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న అంతర్గత రాజకీయాల గురించి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈమేరకు పూర్తి వివరాలతో కూడిన 16 పేజీల లేఖను ఆమెకు అందజేశారు.
Konda Surekha Key Comments
అనంతరం కొండా సురేఖ (Konda Surekha), కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తన భర్తకు భయం అన్నది లేదన్నారు. తమ బ్లడ్ లో దాని గురించి ఆలోచనే ఉండదన్నారు. ఇదే సమయంలో తన కూతురు కొండా సుష్మిత గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల విషయంలో తన సోషల్ మీడియాలో పోటీలో ఉంటానని అప్ డేట్ చేయడం పట్ల ఎందుకు అంత రాద్దాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు కొండా దంపతులు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. తన కూతురుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయని, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందన్నారు. తమ కూతురు తొందరపడి అన్నదో లేక తెలియక అలా పేర్కొందో ఆ విషయం తమకు తెలియదన్నారు. కొండా మురళీ, సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు అని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకి ఉందన్నారు. తన ఆలోచనను కాదనే హక్కు తమకు లేదన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu New Innovation : టాటా భాగస్వామ్యంతో డీజీ నెర్వ్ సెంటర్స్ – సీఎం
