CM Chandrababu : చిత్తూరు జిల్లా – రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆస్పత్రుల్లో టాటా సంస్థతో కలిసి డీజీ నెర్వ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). కుప్పంలో ఇవాళ రెండో రోజు పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాన ఆస్పత్రిలో నూతనంగా టాటా డీజీ నెర్వ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి సత్య కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీజీ నెర్వ్ సెంటర్ సేవలను అందివ్వాలంటే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోతారా..? లేక అదనపు సిబ్బంది అవసరమా అని ప్రశ్నించారు సీఎం.
CM Chandrababu New Innovation
ఈ తరహా సేవలను అందించేందుకు అదనంగా 2 వేల మంది సిబ్బంది అవసరమవుతారని వెల్లడించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ బాబు. పీహెచ్సీల్లో డీజీ నెర్వ్ సెంటర్ సేవలు ఏ విధంగా ఉన్నాయోననే అంశాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రి నుంచి వర్చువల్ గా పర్యవేక్షించారు చంద్రబాబు. వైద్య నిపుణులతో రోగుల కన్సెల్టెన్సీ సేవల గురించి ఆరా తీశారు. డీజీ నెర్వ్ సెంటర్ సిబ్బందితో మాట్లాడారు.
తాము పబ్లిక్ పాలసీని తెస్తున్నామని ప్రకటించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాల ఆరోగ్య సేవలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. టాటా భాగస్వామ్యంతో డీజీ నెర్వ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. మామిడి రైతులకు మేం చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేసే వారు ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఏ కొంచం కష్టం వచ్చినా ఊరుకోనని అన్నారు. ఇప్పటికే పొగాకు పండించే రైతులకు నగదు జమ చేశామన్నారు సీఎం.
Also Read : CM Chandrababu Strong Reaction : బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం జరగదు – సీఎం
