Komatireddy Raj Gopal Reddy Shocking Comments : పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నా

ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కామెంట్స్

Hello Telugu - Komatireddy Raj Gopal Reddy Shocking Comments

Hello Telugu - Komatireddy Raj Gopal Reddy Shocking Comments

Komatireddy Raj Gopal Reddy : న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. తాను పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నానని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంత వ‌ర‌కు ఒక్క పైసా కూడా రాలేద‌న్నారు. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఎన్నిక‌ల కంటే ముందు చెప్పార‌ని వాపోయారు కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy). ఇప్పుడు నోరు మెద‌ప‌డం లేదంటూ మండిప‌డ్డారు. ఒక ర‌కంగా పార్టీ నన్ను మోసం చేసింద‌న్నారు.

MLA Komatireddy Raj Gopal Reddy Shocking Comments

సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపింది. చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. త‌న‌తో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారని మండిప‌డ్డారు. ఆయ‌న కొడుక్కి ఎంపీ టికెట్ ఇచ్చారు, సోద‌రుడికి ఎమ్మెల్యే ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను అన్నింటినీ వ‌దులుకుని పార్టీలో చేరితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. కావాల‌ని త‌న‌ను ప‌క్క‌న పెట్టారంటూ ధ్వ‌జ‌మెత్తారు. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి మోసం చేయ‌డం ప‌ట్ల త‌న‌కు బాధగా ఉంద‌న్నారు. త‌న‌కు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

Also Read : Yemen Chief Death : ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ మిలిట‌రీ చీఫ్ హ‌తం

Exit mobile version