Yemen Chief Death : ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ మిలిట‌రీ చీఫ్ హ‌తం

అధికారికంగా ధ్రువీక‌రించిన యెమ‌న్ ప్ర‌భుత్వం

Hello Telugu - Yemen Chief Death

Hello Telugu - Yemen Chief Death

Yemen : యెమెన్ : యెమ‌న్ ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇజ్రాయెల్ జ‌రిపిన వైమానిక దాడుల్లో యెమ‌న్ దేశానికి చెందిన అత్యున్న‌త హౌతీ మిల‌ట‌రీ (సైనిక‌) చీఫ్ ముహమ్మద్ అబ్దుల్ కరీం అల్-గమారి హ‌త‌య్యాడు. ఈ విష‌యాన్ని అధికారికంగా ద్రువీక‌రించింది యెమెన్. కాగా దేశంలో దశాబ్దాలుగా జరిగిన యుద్ధంలో తన పాత్రకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఆ గ్రూపుతో ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి . ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. అల్-ఘమారి తాము జ‌రిపిన దాడిలో యెమెన్ (Yemen) ఆర్మీ చీఫ్ ప్రాణాలు కోల్పోయాడ‌ని పేర్కొన్నారు.

Yemen Army Chief Death

గ‌త ఆగస్టు 28న ఇజ్రాయెల్ వ‌రుస‌గా దాడులు చేప‌ట్టింది. ఆ దాడిలో హౌతీ ప్రధాన మంత్రి అహ్మద్ అల్-రహవి, ఇతరులు మరణించారు. అయితే, రహస్య సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వేరే దాడిలో అల్-ఘమారి గాయపడి ఉండవచ్చని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. ఇజ్రాయెల్ అల్-ఘమారిని చంపిందని అంగీకరించారు. త‌మ‌కు హాని క‌లిగించాల‌ని గ‌త కొంత కాలంగా ల‌క్ష్యంగా చేసుకున్నారు. అందుకే తుద ముట్టించాల‌ని తాను ఆదేశించాన‌ని, ఆ మేర‌కు దాడులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌న్నారు.

Also Read : MEIL Director Dorayya Important Update : ఎంఈఐఎల్ కు 225.5 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్

Exit mobile version