Komatireddy Raj Gopal Reddy : హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత మరోసారి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డి వెనుక 20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ సంపద, భూములు, కాంట్రాక్టులు అన్నీ వారు దోచుకుంటున్నారని వాపోయారు. ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తేనే మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
Komatireddy Raj Gopal Reddy Key Comments
ప్రధానంగా గతంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియా పై దాడి తగదు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో మరోసారి అలజడికి కారణమయ్యారు ఎమ్మెల్యే. ఇదే సమయంలో కేబినెట్ లో రవాణా శాఖ మంత్రి గా ఉన్న తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విషయంలో తనను దూర్చవద్దంటూ కోరారు. తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కేవలం ఒక మంత్రిని అని.. నా తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో లేనని చెప్పారు. . అయినా పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన కంపెనీకి ఇటీవల రోడ్డు కాంట్రాక్ట్ దక్కిన నేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన ఆరోపిస్తున్న ఇరవై మంది ఆంధ్రా కాంట్రాక్టర్లలో ఆయన కూడా ఒకరని ఈపాటికే ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్.
Also Read : MLC Kavitha Fired on BJP : బీజేపీ మోసం బీసీలకు శాపం – కవిత
