ఆర్ఎస్ఎస్ ప‌రివారంలో ఖ‌ర్గే లేఖ క‌ల‌కలం

ఎవ‌రైనా స‌రే రాజ్యాంగానికి లోబ‌డి ఉండాల్సిందే

hellotelugu-PriyankKharge

బెంగ‌ళూరు : ఒకే ఒక్క లేఖ‌తో సంచ‌ల‌నంగా మారారు క‌ర్ణాట‌క రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే. ఆయ‌న ఆర్ఎస్ఎస్ అధినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు సుదీర్ఘ‌మైన లేఖ రాశారు. త‌మ రాష్ట్రంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన లావాదేవీలు, కార్య‌క్ర‌మాల వివ‌రాలు వెల్ల‌డించాల‌ని స్ప‌ష్టం చేశారు. దెబ్బ‌కు ఆర్ఎస్ఎస్ లో ఈ లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. దీనికి సంబంధించి ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఆ లేఖ చాలా స్పష్టంగా ఉంది.. వారు నా రాష్ట్రంలో యూనిఫాంలు ధరించి ఐదు వందలకు పైగా మార్చ్‌లు నిర్వహించారు. ప్రతిరోజూ వారికి నాలుగు వేలకు పైగా శాఖలు ఉన్నాయి. నేను అడుగుతున్నదల్లా ఒక్కటే, వారు రిజిస్టర్డ్ సంస్థ కానప్పుడు, ఏ చట్టం కింద మీరు పని చేస్తున్నారు?… నేను అడిగిన దానిలో నాకు అహేతుకమైనది గానీ, రాజ్యాంగ విరుద్ధమైనది గానీ ఏమీ కనిపించడం లేదు… మీ దగ్గర పత్రాలు ఉంటే, వారి ముఖం మీదే కొట్టండి… ఆ వివరణ సరైనదని తేలితే, నేను క్షమాపణ చెబుతాను.

వారి వివరణ సరైనది కాకపోతే, వారే క్షమాపణ చెప్పాలి. దానిని నిషేధించాలని గానీ, కర్ణాటక ప్రభుత్వం నిషేధిస్తోందని గానీ ఆ లేఖలో నేను ఏమీ రాయలేదు… హిందూ మతాన్ని రిజిస్టర్ చేయమని నేను ఎప్పుడు అడిగాను? ఈ సంస్థ, మరియు ఏ సంస్థ అయినా సరే, అది కేవలం రాజ్యాంగం కింద మాత్రమే పని చేయాల్సి ఉంటుంద‌ని నొక్కి చెప్పారు ప్రియాంక్ ఖ‌ర్గే.

Exit mobile version