PM Kisan Interesting Update : పీఎం కిసాన్ నిధుల విడుదలపై కేంద్ర సర్కార్ కీలక అప్డేట్

ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వర్చువల్ రూపంలో పాల్గొననున్నారు...

Hello Telugu - PM Kisan Interesting Update

Hello Telugu - PM Kisan Interesting Update

PM Kisan :  దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకం 20వ విడత విడుదల తేదీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ విడతను వచ్చే ఆగస్టు 2, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వర్చువల్ రూపంలో పాల్గొననున్నారు.

PM Kisan Key Update

ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు బ్యాంకు ఖాతాలోకి రూ.2,000 చొప్పున నిధులు నేరుగా జమ కానున్నాయి. ప్రభుత్వం అంచనా ప్రకారం, ఈ విడతలో సుమారు 9.3 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. నిధులు బదిలీ అయిన వెంటనే లబ్ధిదారులకు SMS ద్వారా సమాచారం అందుతుంది.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019లో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ.6,000ను వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేస్తారు. ఇప్పటి వరకు 19 విడతల ఫైనాన్షియల్ సహాయం రైతులకు అందగా, ఇప్పుడు 20వ విడత విడుదలకు రంగం సిద్ధమైంది.

కాగా, ఈ పథకం ప్రయోజనం పొందాలంటే e-KYC పూర్తి చేయడం, భూమి రికార్డుల ధృవీకరణ తప్పనిసరి. ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం, అవసరమైన వివరాలు అప్డేట్ చేయడం లాంటి ప్రక్రియలు పూర్తి చేయని లబ్ధిదారులకు ఈ విడతలో నిధులు జమకానవు. రైతులు తమ వివరాలను సకాలంలో సరిచేసుకుని, ఫైనాన్షియల్ మద్దతు పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Also Read : PM Kisan Interesting Update : ఎట్టకేలకు పీఎం కిసాన్ పై కీలక అప్డేట్ ఇచ్చిన కేంద్ర సర్కార్

Exit mobile version