Tik Tok Important Update : టిక్ టాక్ రీఎంట్రీ పై కేంద్రం కీలక అప్డేట్

భారత్‌లో అందుబాటులోకి వస్తుందనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది...

Hello Telugu - Tik Tok Important Update

Hello Telugu - Tik Tok Important Update

Tik Tok : భారత్ సంబంధాలు ఇటీవలి కాలంలో కొంత మెరుగయ్యాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నప్పటికీ, చైనీస్ యాప్‌ టిక్‌టాక్పై విధించిన నిషేధం ఎత్తివేతకు సంబంధించి కేంద్రం స్పష్టతనిచ్చింది. టిక్‌టాక్‌ (Tik Tok) మళ్లీ భారత్‌లో అందుబాటులోకి వస్తుందనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.

కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మనీకంట్రోల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ప్రస్తుతం టిక్‌టాక్‌ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి చర్చలు ప్రభుత్వంలో జరగలేదు. అలాంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదు” అని తెలిపారు. దీంతో యాప్‌ పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది.

Tik Tok – భారత్‌లో నిషేధం నేపథ్యం

సుమారు ఐదేళ్ల క్రితం చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో పాటు అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది. దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశముందని పేర్కొంటూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బైట్‌డాన్స్‌కి చెందిన హలో, క్యాప్‌కట్‌ వంటి యాప్‌లు కూడా అదే ఆర్డర్‌లో నిషేధించబడ్డాయి.

అమెరికాలో పరిస్థితి

భారత్‌తో పాటు అమెరికాలో కూడా టిక్‌టాక్‌ నిషేధాన్ని ఎదుర్కొంది. జాతీయ భద్రత కారణంగా ఈ యాప్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, యాప్‌ యాజమాన్యం అమెరికన్‌ కంపెనీ లేదా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తేనే తిరిగి అనుమతించే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో టిక్‌టాక్‌ రీఎంట్రీ జరిగే అవకాశాలు లేవు. దేశ భద్రత, డేటా రక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న వైఖరిని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Gold Price Sensational : ఓ సరికొత్త రికార్డు సృష్టించిన పసిడి ధరలు

Exit mobile version