Gold : పసిడి పరుగు ఆగే సూచనలు కనబడటం లేదు. వరుసగా రెండవ రోజు కూడా బంగారం ధరలు కొత్త గరిష్ఠాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు, పెట్టుబడిదారులు రక్షిత ఆస్తులవైపు మళ్లడం వంటి అంశాలు దేశీయ మార్కెట్లో ధరలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Gold Price Updates
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ డెలివరీ కాంట్రాక్టు ధర రూ.452 పెరిగి 10 గ్రాములకు రూ.1,08,180గా నమోదైంది. డిసెంబర్ డెలివరీ కాంట్రాక్టు కూడా రూ.370 పెరిగి రూ.1.09 లక్షల మార్క్‌ను దాటింది.
ఇక వెండి కూడా వెనుకంజ వేయలేదు. డిసెంబర్ డెలివరీ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,703 ఎగబాకి రూ.1,26,400 పలికింది. ఈ స్థాయిలో వెండి ధరలు ఉండడం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నిపుణులు భావిస్తున్నదేమిటంటే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ ఆర్థిక విధానాలు బంగారం, వెండి ధరలను రాబోయే రోజుల్లో మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యూహాలు రచించాలని సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు
