కేరళ : కేరళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజా చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఇవాళ లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ వివరాల్లో ముఖ్యమంత్రి పదాన్ని తీసివేసి.. సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో అని చేర్చడం సంచలనంగా మారింది. సాధారణంగా ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తేలిపోయాక ఫలితాలను బట్టి మార్పులు చేయడం సహజం. కానీ అందుకు భిన్నంగా ముందే తొలగించడం ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ , బీజేపీ కేరళ నేతలు తాము ఓడి పోతున్నామని ముందే తెలిసిపోవడం వల్లే.. ఆయన అలాచేసి ఉంటారని సెటైర్లు వేస్తున్నారు. లెఫ్ట్ పార్టీల నేతలు మాత్రం ఆయన చర్యను సమర్ధిస్తుండడం విశేషం.
విజయన్ ఆది నుండి నిబద్ధత కలిగిన నాయకుడని.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చేవరకు ఆపద్ధర్మంగా పదవిలో కొనసాగుతారని.. ఎలాగు ఫలితాలు కొన్ని గంటల్లో వస్తాయి కాబట్టి.. ఒక నియమావళికి కట్టుబడి అలా ముఖ్యమంత్రి పదాన్ని తొలగించి ఉంటారని ప్రత్యర్థి పార్టీల కామెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నారు.
ఆయన మొత్తంగా పదాన్ని తొలగించారు. మాజీ ముఖ్యమంత్రి అని పేర్కొనలేదు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే వ్యక్తి కాబట్టి హుందాగా వ్యవహరిస్తున్నారని,. చిల్లర రాజకీయ మనస్తత్వంతో ఆలోచించే కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఎన్నికల కమిషన్.. రాజ్యాంగం పట్ల గౌరవం లేదని మరోసారి తేలి పోయిందని ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.















