Kane Williamson : న్యూజిలాండ్ : న్యూజిలాండ్ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సంచలన ప్రకటన చేశాడు. తాను ఇక టి20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు న్యూజిలాండ్ జట్టుకు సేవలు అందించాడు. సారథిగా ఆ జట్టులో స్పూర్తి నింపాడు. అనేక విజయాలను అందించాడు. టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్ లలో కీవీస్ కు చిరస్మరణీయమైన గెలుపు అందించడంలో కీలక పాత్ర పోషించాడు కేన్ విలియమ్సన్. తను క్రికెటరే కాదు మనసున్న వ్యక్తి. పాకిస్తాన్ టూర్ సమయంలో వరదలకు సర్వస్వం కోల్పోయిన పాకిస్తానీయులకు తనకు వచ్చే ఫీజును విరాళంగా ప్రకటించాడు. ఎన్నో గుప్త దానాలు చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా స్వదేశంలో విండీస్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టి20 సీరీస్ కు ముందే తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేశాడు కేన్ మామ.
Kane Williamson Retire
ఇదిలా ఉండగా కేన్ విలియమ్సన్ తన టి20 ఫార్మాట్ కెరీర్ ను 2011లో ప్రారంభించాడడు. న్యూజిలాండ్ జట్టు తరపున 93 మ్యాచ్ లు ఆడాడు. 2,575 పరుగులు చేశాడు. బ్యాటర్ గా తను కీ రోల్ పోషించాడు. ఇదే సమయంలో న్యూజిలాండ్ జట్టుకు సారథిగా 75 మ్యాచ్ లకు వ్యవహరించాడు. తన జట్టును 2016, 2022లో సెమీ ఫైనల్ వరకు చేర్చాడు. అంతే కాదు 2021లో జరిగిన వరల్డ్ కప్ లో ఫైనల్ కు తీసుకు వెళ్లడంలో ముఖ్య భూమిక పోషించాడు. చాలా కాలం పాటు క్రికెట్ కు సేవలు అందించానని, ఇక తన కుటుంబం కోసం సమయం కేటాయించాల్సిన అవసరం ఉందన్నాడు ఈ సందర్బంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ కేన్ మామ. అయితే ఇక నుంచి వన్డే, టెస్టు ఫార్మాట్ లలో ఆడతాడు.
Also Read : Deepti Sharma Super Bowling : సఫారీలను శాసించిన దీప్తి శర్మ
