Deepti Sharma Super Bowling : స‌ఫారీల‌ను శాసించిన దీప్తి శ‌ర్మ

ఐసీసీ టోర్నీలో 22 వికెట్లు తీసింది

Hello Telugu - Deepti Sharma Super Bowling

Hello Telugu - Deepti Sharma Super Bowling

Deepti Sharma : ముంబై : భార‌త మ‌హిళా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. ద‌శాబ్దాల క‌ల‌ను సాకారం చేసింది. 143 కోట్ల భార‌తీయుల ఆశ‌ల‌కు జీవం పోస్తూ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2025ను స‌గ‌ర్వంగా ముద్దాడింది. టాస్ ఓడి పోయి మైదానంలోకి దిగిన ఉమెన్ ఇన్ బ్లూ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 298 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. తొలి వికెట్ కు స్మృతీ మంధాన్న‌, షెఫాలీ వ‌ర్మ లు క‌లిసి 104 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

షెఫాలీ వర్మ స‌ఫారీ బౌల్ల‌ర‌కు చుక్క‌లు చూపించింది. త‌ను 78 బంతులు ఎదుర్కొని 87 ర‌న్స్ చేసింది. ఇందులో 7 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. ఇక భార‌త జ‌ట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన్నా 58 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల‌తో 45 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత దీప్తి శ‌ర్మ (Deepti Sharma) సూప‌ర్ షో చేసింది. ద‌క్షిణాఫ్రికా బౌలర్ల‌కు ప‌రీక్ష పెడుతూ ప‌రుగులు తీసింది. త‌ను 58 బంతుల్లో 58 ర‌న్స్ చేసింది. ఇందులో 3 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. భార‌త జ‌ట్టు 298 ప‌రుగులు చేసింది.

Deepti Sharma Interesting Game

అనంత‌రం 299 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టు. నిర్ణీత ఓవ‌ర్లు ఆడ‌కుండానే 45.3 ఓవ‌ర్ల‌లోనే స‌ఫారీ టీం ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ల‌లో అద్భుతంగా బౌలింగ్ చేసింది దీప్తి శ‌ర్మ‌, షెఫాలీ వ‌ర్మ‌లు. దీప్తి ఏకంగా 5 వికెట్లు కూల్చింది. 58 ర‌న్స్ చేయ‌గా షెఫాలీ 87 ర‌న్స్ తో పాటు 2 కీలక విక‌ట్లు తీసింది. అంతే కాదు దీప్తి శ‌ర్మ ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్య‌ధికంగా వికెట్లు కూల్చింది. త‌ను మొత్తం 22 వికెట్లు తీసి విస్తు పోయేలా చేసింది. సెఫాలీ వ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది ఉమెన్ అవార్డు ద‌క్క‌గా దీప్తి శర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ పుర‌స్కారం ల‌భించింది.

Also Read : INDW vs SAW – Shafali Verma Sensational : స‌త్తా చాటిన షెఫాలీ వ‌ర్మ

Exit mobile version