Minister Kandula Durgesh – AP Growth : విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాం

స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

Hello Telugu - Minister Kandula Durgesh - AP Growth

Hello Telugu - Minister Kandula Durgesh - AP Growth

Kandula Durgesh : విజయవాడ : పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) అన్నారు. సోమవారం విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్ లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా మందలపు రవికుమార్ తో మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ప్రమాణ స్వీకారం చేయించారు. జ్యోతి ప్రజ్వలనతో పదవీ బాధ్యత ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారన్న నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఛైర్మన్ గా మందలపు రవికుమార్ ఎంపికను సమర్థిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీలకు వినియోగిస్తూ, అదే విధంగా సామాన్య ప్రజలకు చేరవేసి తద్వారా శాఖల అభివృద్ధిలో, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలలో భాగస్వామ్యులు కావాలని మందలపు రవికుమార్ కు సూచించారు.

Minister Kandula Durgesh Key Comments

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. దార్శనిక సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత ఇష్టమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా మందలపు రవికుమార్ ను నియమించడం సంతోషంగా ఉందన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తదితర అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్న మొట్ట మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చేందుకు విద్యావంతుడైన రవిని సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా నియమించడం ముదావహమన్నారు. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా జోడైతే మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకు రాగలమని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. ఈ సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని రవికి సూచించారు. సైన్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా మందలపు రవి ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నారన్నారు.

Also Read : Minister Ponnam Shocking Comments : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై పొన్నం షాకింగ్ కామెంట్స్

Exit mobile version