Kandula Durgesh : అమరావతి – అందరి వాడిగా పేరొందిన దివంగత వంగవీటి మోహన రంగా మాదిరిగా వంగవీటి రాధ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజా నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). అమరుడై 35 గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన మహా నాయకుడు రంగా అని కొనియాడారు. వంగవీటి మోహన రంగా విగ్రాహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే వంగవీటి మోహన రంగా లక్ష్యమన్నారు. వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.
Minister Kandula Durgesh Comments
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా ఏనాడూ పేద ప్రజలను కులాల రూపంలో చూడలేదని అన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా కీర్తి గాంచారన్నారు. పేదలకు అండగా నిలబడి న్యాయం చేసిన నాయకుడు కాబట్టే నేటికీ గ్రామాల్లో పట్టణాల్లో ఆయన విగ్రహాలు దర్శనమిస్తున్నాయని అభివర్ణించారు. తన చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసం బతికిన మహోన్నత నాయకుడు, పేద ప్రజల కంట కన్నీరు రాకుండా చూసిన నాయకుడు వంగవీటి మోహన రంగా అన్నారు. అదే తమకు రాజకీయాల్లో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆయన స్ఫూర్తితో కుల మతాలకతీతంగా అన్ని కులాల్లోని పేదలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
పెద్దోడిని కొట్టి పేదోడికి పంచిన అభినవ రాబిన్ హుడ్ వంగవీటి మోహన రంగా అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పార్టీలకతీతంగా వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచిన నాయకుడు అని వివరించారు. పేదవాడి కంట కన్నీరు తుడవటం మీద లక్ష్యంగా పార్టీని స్థాపించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు సైతం వంగవీటి మోహనరంగా ఆలోచనలకు దగ్గరగా ఉంటాయన్నారు. పేద ప్రజల కోసం పరితపించిన ఆయన విధానాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : Minister Vakiti Srihari Sensational : గొర్రెలు, గేదెలు నాకిస్తే ఏం చేసుకోవాలి – మంత్రి
