Minister Vakiti Srihari Sensational : గొర్రెలు, గేదెలు నాకిస్తే ఏం చేసుకోవాలి – మంత్రి

ఆగ‌మైన శాఖ‌ల‌ను నాకిచ్చారంటూ ఆవేద‌న

Hello Telugu - Minister Vakiti Srihari Sensational

Hello Telugu - Minister Vakiti Srihari Sensational

Vakiti Srihari : హైద‌రాబాద్ – రాష్ట్ర బీసీ, మ‌త్స్య , క్రీడా , యువ‌జ‌న మంత్రిత్వ శాఖ‌ల మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న‌కు ఇచ్చిన శాఖ‌ల‌న్నీ గంద‌ర‌గోళంగా ఉన్నాయ‌ని వాపోయారు. ఇది త‌న అదృష్ట‌మో లేక దుర‌దృష్ట‌మో తెలియ‌డం లేద‌న్నారు వాకిటి శ్రీ‌హ‌రి (Vakiti Srihari). గ‌త ఐదు సంవ‌త్స‌రాల‌లో ఆగ‌మై పోయిన శాఖ‌ల‌ను త‌న‌కు కావాల‌ని కేటాయించారంటూ ఆరోపించారు. ఇదేమి న్యాయం అంటూ ఆయ‌న పేర్కొన్నారు.

Minister Vakiti Srihari Sensational Comments

రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖతో పాటు మరో 5 శాఖలు ఆగమాగమై పోయి ఉన్నాయ‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ ఇస్తే తాను ఏం చేసుకోవాలంటూ ప్ర‌శ్నించారు వాకిటి శ్రీ‌హ‌రి. విచిత్రం ఏమిటంటే గొర్రెలు, గేదెలు ఇస్తే తాను ఏం చేసుకోవాలంటూ నిల‌దీశారు సీఎం రేవంత్ రెడ్డిని, హైక‌మాండ్ ను . తాజాగా వాకిటి శ్రీ‌హ‌రి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు బీసీ కోటా కింద కేబినెట్ విస్త‌ర‌ణ‌లో చోటు ద‌క్కింది. వాకిటి శ్రీ‌హ‌రి ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన మ‌క్త‌ల్ వాస్త‌వ్యుడు. త‌ను కింది స్థాయి నుంచి రాజ‌కీయ ప‌రంగా మంత్రి వ‌రకు ఎదిగారు.

తొలుత స‌ర్పంచ్ గా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చారు. ప్ర‌ధానంగా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కుటుంబంతో త‌న‌కు అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా త‌న త‌న‌యుడు క‌ర్ణాట‌క ఐటీ శాఖ మంత్రితో క‌లిసి వ్యాపార సంబంధాలు ఉండ‌డంతో గ‌త్యంత‌రం లేక సీఎం రేవంత్ రెడ్డి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు ఒప్పుకున్న‌ట్లు బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : KTR Clear Letter to CM : రేవంత్ రెడ్డి లేకి ముఖ్య‌మంత్రి – కేటీఆర్

Exit mobile version