Kanaka Durga Saraswathi Avatar Interesting : సర్వతోముఖాభివృద్ధికి దుర్గామాత అనుగ్రహం

సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

Hello Telugu - Kanaka Durga Saraswathi Avatar Interesting

Hello Telugu - Kanaka Durga Saraswathi Avatar Interesting

Kanaka Durga : విజయవాడ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి అవాంతరాలు రాకూడదని శ్రీ సరస్వతీ దేవి (Saraswathi Devi) అలంకృత దుర్గామాతను ప్రార్ధించినట్లు సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గామాతను సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు . ఆలయ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద కొలుసు పార్థ‌సార‌థి మాట్లాడారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు జగజ్జనని అనుగ్రహం ఉండాలని సరస్వతి మాతను కోరుకున్నానని చెప్పారు.

Kanaka Durga Devi Today As a Saraswathi Avatar

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేందుకు ఈ విజయదశమి నాంది కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులు అమ్మ వారి ద‌ర్శ‌నం కోసం భ‌వానీలు, భ‌క్తులు పోటెత్తారు. ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చార‌ని వెల్ల‌డించారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి. ల‌క్ష్మీశ‌. పెద్ద ఎత్తున వ‌స్తున్న భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 35 ల‌క్ష‌ల ల‌డ్డూలు త‌యారు చేసి రెడీగా ఉంచామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం సీఎం చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా అమ్మ వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు.

Also Read : Telangana Election Schedule Interesting : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Exit mobile version