Kamal Haasan : చెన్నై – ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను ఖండిస్తూ గొంతు కోస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు బుల్లితెర నటుడు రవిచంద్రన్. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కమల్ హాసన్ (Kamal Haasan) పార్టీ నాయకులు.
Threats to Kamal Haasan
ఇదిలా ఉండగా ఇటీవల ఆయన కన్నడ భాషపై కూడా చేసిన కామెంట్ తీవ్ర దుమారానికి దారి తీసింది. చివరకు కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషుల మనోభావాలను దెబ్బ తీసేలా ప్రముఖులు ఎవరైనా సరే కామంట్స్ చేయకూడదని సూచించింది. తను నటించిన థగ్ లైఫ్ ను ఇక్కడ ఎందుకు ప్రదర్శిస్తున్నారంటూ ప్రశ్నించింది.
ఈ సందర్బంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసేలా చేసింది సనాతన ధర్మం అనే పదం. దీనిని ఎక్కువగా ప్రస్తుతం ఉపయోగిస్తున్నది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన పదే పదే దీని గురించి ప్రస్తావిస్తున్నారు. తానే దానికి ప్రతినిధిగా అన్నట్లు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.
ఈ తరుణంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నటుడు సూర్య ఛారిటబుల్ ఆర్గనైజేషన్ అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు ప్రముఖ నటుడు , ఇలయ నాయగన్, ఎంపీ కమల్ హాసన్. విద్య మాత్రమే సనాతన సంకెళ్లను బద్దలు కొట్టగలదని కమల్ అన్నారు. విద్యను ఆయుధంగా ఉపయోగంచు కోవాలని పిలుపునిచ్చారు.
Also Read : Saiyaara Sensational Collections : రూ. 517.5 కోట్లను దాటేసిన సయ్యారా
