Saiyaara Sensational Collections : రూ. 517.5 కోట్ల‌ను దాటేసిన స‌య్యారా

బాలీవుడ్ లో మూవీ రికార్డ్ బ్రేక్

hellotelugu-saiyaara

Saiyaara : ముంబై – మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం స‌య్యారా (Saiyaara) సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా దూసుకు పోతోంది క‌లెక్ష‌న్ల ప‌రంగా. మిగతా చిత్రాల‌ను తోసి రాజ‌ని ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. ప్రేమ క‌థ‌ను అద్భుతంగా తెర మీద పండించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు. జూలై లో స‌య్యారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 23 రోజుల వ‌ర‌కు ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 517.5 కోట్ల‌ను దాటేసింది. ఇందులో అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా న‌టించారు. నాల్గ‌వ వారాంతంలో గ‌ణ‌నీయ‌మైన వృద్దిని న‌మోదు చేసింది.

Saiyaara Movie Collections

ఈ రొమాంటిక్ డ్రామా అద్భుతమైన స్పందనతో ప్రారంభమైంది, 1వ వారంలో రూ. 172.75 కోట్లు, ఆ తర్వాత 2వ వారంలో రూ. 107.75 కోట్లు వసూలు చేసింది. 3వ వారం దాదాపు రూ. 28.25 కోట్లు వసూలు చేసింది. తాజా గణాంకాల ప్రకారం ‘సయ్యారా’ దేశీయ నికర కలెక్షన్స్‌ను రూ. 314.10 కోట్లకు చేరుకుంది, ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన ప్రేమకథగా నిలిచింది.

తాజా వాణిజ్య అంచనాల ప్రకారం ‘సయ్యారా’ భారతదేశంలో రూ. 315.84 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది, దీని స్థూల దేశీయ మొత్తం రూ. 373 కోట్లు (GSTతో సహా). ఓవర్సీస్ మార్కెట్లు దాదాపు రూ.144 కోట్ల గ్రాస్‌ను అందించాయి, దీనితో ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ.517.5 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహిత్ సూరి స్పందించాడు. సంగీత దర్శకుడు మోహిత్ చౌహాన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు . ఈ సినిమా ఇంత‌గా జ‌నాద‌ర‌ణ పొంద‌డానికి కార‌ణం త‌నేన‌ని పేర్కొన్నాడు. మ‌న‌సు దోచుకునే సంగీతం, పాట‌లు అందించాడంటూ ప్ర‌శంసించాడు.

Also Read : Anupama Parameswaran Growth : ప‌ర‌దాలో నా ఆత్మ‌ను ధార పోసి న‌టించా

Exit mobile version