హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ కలిగిన దర్శకుడు అనిల్ రావిపూడి. తనకు సినిమాల పరంగా తొలుత నమ్మి అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. అందుకే అనిల్ రావిపూడి ప్రతీసారి తనను గుర్తు చేస్తుంటాడు. తను ఛాన్స్ ఇవ్వడం వల్లనే ఇవాళ మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానని అన్నాడు. కళ్యాణ్ రామ్ తో తొలుత పటాస్ తీశాడు. అది బిగ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా తీసిన ప్రతి సినిమాని బ్లాక్ బస్టర్ గా తీశాడు. ఇండస్ట్రీలో టాప్ హీరోలతో మూవీస్ చేశాడు అనిల్ రావిపూడి.
తన దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, ప్రిన్స్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ్, చిరంజీవి తో మూవీస్ తీశాడు. అన్నీ బంపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా తను చిరంజీవి, విక్టరీ వెంకటేష్, టీవీకే గణేష్ , నయనతార తో కలిసి తీసిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతకు ముందు గత ఏడాది 2025లో సంక్రాంతికి వస్తున్నాం తీశాడు. ఇందులో వెంకటేశ్ , ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ చిత్రం కూడా రూ. 300 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, ఆస్థాన హీరో వెంకటేశ్ తో క్రేజీ క్రేజీ మల్టీస్టారర్ అనౌన్స్‌మెంట్ చశాడు అనిల్ రావిపూడి.
