K Kavitha Shocking Comments Handloom Workers : చేనేత కార్మికుల బ‌తుకులు ఆగ‌మాగం

పెన్ష‌న్ త‌ప్పా ఏ ఆధారమూ లేద‌ని ఆవేద‌న

Hello Telugu - K Kavitha Shocking Comments Handloom Workers

Hello Telugu - K Kavitha Shocking Comments Handloom Workers

K Kavitha : వ‌న‌ప‌ర్తి జిల్లా : నేత‌న్న‌ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (K Kavitha). జాగృతి జనం బాటలో భాగంగా ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోటలోని వీవ‌ర్స్ కాల‌నీలో ఉన్న‌ చేనేత కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేత‌న్న‌ల బాధ‌లు విన్నారు. వారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని క‌విత‌కు విన్న‌వించారు. చేనేత కార్మికుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేడా అని చూస్తారని, అలాంటి బట్టను నేసే చేనేత కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతుండ‌డం ప‌ట్ల భావోద్వేగానికి లోన‌య్యారు.

K Kavitha Shocking Comments

ఒక్క తెలంగాణలోనే కాదు భారత దేశంలో మొత్తంగా కూడా నేత‌న్న‌ల ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వారి ద‌య‌నీయ ప‌రిస్థితిని గుర్తించి ఆస‌రా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క నేత కుటంబానికి పెన్షన్, నూలుకు సబ్బిడీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఎన్నో హామీలు ఇచ్చి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ నేత కార్మికుల‌కు ఇస్తున్న స‌బ్సిడీని ఆపేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వారికి పెన్ష‌న్ త‌ప్పా ఇంకే ఆధారం లేకుండా పోయింద‌న్నారు క‌విత‌. కుటుంబంలో చేనేత పెన్ష‌న్ ఇవ్వ‌డంతో పాటు సాధార‌ణ పెన్ష‌న్ సౌక‌ర్యం కూడా క‌ల్పించాల‌ని ఆమె స‌ర్కార్ ను డిమాండ్ చేశారు.

Also Read : CM Revanth Reddy Important Update : అధికారికంగా స‌త్య‌సాయి శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు

Exit mobile version