CM Revanth Reddy : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. సాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. భగవాన్ శతజయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి కేపీ రాధాకృష్ణన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాయిబాబా సేవలను గుర్తు చేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
CM Revanth Reddy Gives Key Update on Sri Sathya Saibaba Centuary Celebrations
సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవులను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించ వచ్చని నిరూపించారని స్పష్టం చేశారు. సాయి మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వహకుల అందరిలో కనిపిస్తోందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను బాబా , వారి ట్రస్టు ద్వారా చేసి చూపించారని కొనియాడారు. ముఖ్యంగా ప్రతి వారూ చదువు కోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.
Also Read : Minister Sridhar Babu Challenge : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తాం
