K Kavitha : నల్లగొండ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha) రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ సందర్శించారు. డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తైతే వేలాది మందికి లాభం జరుగుతుందన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రజలు పెద్ద మనసు చేసుకొని తమ భూములు ఇచ్చారని చెప్పారు. 2015 లోనే తొందరగా ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే సమస్యలు ఉండక పోయేవని అన్నారు. దాదాపు 11 ఏళ్లు ఆలస్యమైందని మండిపడ్డారు. దీంతో అప్పుడు 18 ఏళ్లు నిండని చాలా మందికి ఇప్పుడు 18 ఏళ్లు దాటాయని అన్నారు.
K Kavitha Strong Demand
వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని స్పష్టం చేశారు కవిత. అప్పుడున్న ధరలకు ఇప్పుడున్న ధరలకు చాలా తేడా ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదన్నారు. అంతే కాకుండా నిర్వాసితులకు ఇళ్లు గానీ వేరే కాలనీలు గానీ కట్టించక పోవడం దారుణమన్నారు. ప్రజలను వారికి కట్టించిన ఇళ్లలో దిగపెట్టే వరకు నెల నెల ఖర్చు ఇవ్వాలని చట్టంలో ఉందని వెల్లడించారు. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ఇక్కడకు వచ్చానని చెప్పారు. గతంలో మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆ ఎన్నిక గురించి మాట్లాడారని, కానీ గెలిచాక స్పందించక పోవడం దారుణమన్నారు కవిత. ఆనాడు భారీ ఎత్తున ఖర్చు చేశారని, దాంట్లో సగమైనా బాధితులకు, నిర్వాసితులకు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు కవిత.
Also Read : CM Chandrababu Clear Update : ఏపీలో పరుగులు తీస్తున్న పారిశ్రామికాభివృద్ది
