CM Chandrababu : అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). దేశంలో ఏపీ రైజింగ్ స్టేట్ గా ముందుకు సాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 1,30 వేల కోట్లకు పైగా పెట్టుబబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దీని వల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు సీఎం. ప్రస్తుతం పారిశ్రామిక అభివృద్ధి ఏపీలో పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. అంతే కాకుండా తమ సర్కార్ పారిశ్రామిక అభివృద్దికి 17 నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Key Comments
సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని పేర్కొన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల పండుగ కనిపిస్తోందని తెలిపారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త కార్యక్రమం అమలులో భాగంగా కనిగిరిలోని పెదఈర్లపాడు ఎంఎస్ఎంఈ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు, 38 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు సీఎం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు. వారిని పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తున్నామని చెప్పారు. గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయి..పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. కానీ నేడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆలోచనతో వస్తే చాలు అవకాశాలు కల్పిస్తాం అని ప్రకటిస్తున్నాం అన్నారు.
Also Read : Maganti Sunitha Shocking Comments : ఇంత దౌర్జన్యం నేను ఎన్నడూ చూడలేదు
