DY CM Pawan Kalyan Clear Instructions : హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలి

ప్రత్యేకమైన కాలపరిమితి, కార్యాచరణ అవసరం

Hello Telugu - DY CM Pawan Kalyan Clear Instructions

Hello Telugu - DY CM Pawan Kalyan Clear Instructions

Pawan Kalyan : చిత్తూరు జిల్లా : మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో అటవీ జంతువులకు సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ ‘హనుమాన్’ (Healing And Nurturing Units for Monitoring, Aid , Nursing of Wildlife) ప్రాజెక్ట్ రూపొందించింద‌ని ప్ర‌క‌టించారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ (Pawan Kalyan). 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ను అటవీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. హనుమాన్ ప్రాజెక్ట్ లోని ప్రతి అంశాన్ని ఆసక్తిగా విన్న పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్లడానికి అంశాల వారీగా నిర్దుష్ట కాలపరిమితి అవసరం అన్నారు. జంతువుల సంచారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ ను రూపొందించాల‌ని సూచించారు. ఇది మార్చి 3వ తేదీలోపు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు.

DY CM Pawan Kalyan Key Comments

హనుమాన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లే అంశంపై అటవీశాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు నవంబర్ 3వ వారంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానవులు, జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు బాగుంద‌ని అన్నారు. అయితే ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు కాల పరిమితి పెట్టుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఏనుగులతో తీవ్రంగా దెబ్బ తింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా? దానికి రైతులను ఎలా ఒప్పించాలనే అంశాలపై దృష్టి సారించాలన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువ. అలాంటి వాటికి ఏనుగులు ఎక్కువగా ఆకర్షితమవుతున్నాయన‌ని తెలిపారు.

Also Read : YSRCP Syamala Shocking Comments : ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సంత‌కాల సేక‌ర‌ణ

Exit mobile version