Govindaraja Swami Temple Interesting : క‌వ‌చ స‌మ‌ర్ప‌ణం ముగిసిన జ్యేష్టాభిషేకం

శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆల‌యంలో

Hello Telugu - Govindaraja Swami Temple Interesting

Hello Telugu - Govindaraja Swami Temple Interesting

Govindaraja Swami Temple : తిరుప‌తి – తిరుపతిలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా వినుతి కెక్కిన శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో (Govindaraja Swami Temple) స్వామి వారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది.
ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 08.00 నుండి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం, మహా శాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు.

Govindaraja Swami Temple Updates

అనంతరం శాత్తు మొరై, ఆస్థానం తదుపరి మధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 4.30 గం.ల మధ్య స్వామి అమ్మ వార్లకు కవచ సమర్పణ చేశారు. అంతకు ముందు తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు స్వామి వారిని.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయ నాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ ర్‌స్వామి, డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈవో కె.మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Also Read : TTD EO Interesting Comments : ఏఐ టెక్నాల‌జీతో స‌కాలంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నం – ఈవో

Exit mobile version