TTD : తిరుమల – కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధునిక టెక్నాలజీ సాయంతో నిర్దేశించిన సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు టిటిడి ఈవో జె. శ్యామల రావు సూచించారు. టిటిడి (TTD) కార్యనిర్వాహనాధికారి సమావేశ మందిరంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి టిసిఎస్, ఏఐ ప్రతినిధులు, టిటిడి ఐటీ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
TTD EO Comments
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి సర్వ దర్శనం, సమయ నిర్దేశిత సర్వ దర్శనం (ఎస్.ఎస్.డి), ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్.ఈ.డి), దివ్య దర్శనం తదితర మార్గాల ద్వారా తిరుమలకు భక్తులు వస్తుంటారని, సదరు భక్తులకు ఆధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో సకాలంలో దర్శనం చేయించడంపై తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేవారు ఈవో. భక్తులు శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో చేరినప్పటి నుండి దర్శనం అయ్యే వరకు టెక్నాలజీని ఉపయోగించి శ్రీవారి దర్శనం సులభతరం చేయించే అంశానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ అంశంపై నిర్ధిష్ట నిర్ణయానికి వచ్చేందుకు టిసిఎస్ ప్రతినిధులు, ఏఐ ప్రతినిధులు టిటిడి ఐటీ విభాగం ప్రతినిధులు సమిష్టిగా తరచూ సమావేశాలు నిర్వహించి ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు శ్యామల రావు. టిటిడిలో ఇప్పటి వరకు టిటిడి సిబ్బందితో భక్తులను ధృవీకరించడం జరుగుతోందని, సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న మార్పులకు అనుగుణంగా క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు పద్దతి ద్వారా భక్తులను ధృవీకరించి మరింత సమయాన్ని ఆదా చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఈవో కోరారు. అదే విధంగా శ్రీవారి దర్శనానికి భక్తులకు కేటాయించిన సమయానికి రాకపోవడం మూలంగా మరింత ఆలస్యం అవుతోందని, భక్తులను నిర్దేశించిన సమయానికి వారికి కేచాయించిన ప్రాంతానికి వచ్చేలా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తద్వారా మరింత సమయం ఆదా కావడమే కాక, భక్తులకు సంతృప్తికరమైన శ్రీవారి దర్శనం చేయించవచ్చని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టిటిడి ఐటీ విభాగం జీఎం శేషా రెడ్డి, ఏజీఎం వేంకటేశ్వర చౌదరి, తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Popular Simhachalam Giri Pradakshina : అప్పన్న గిరి ప్రదక్షిణ విజయవంతం చేద్దాం
