Justice Varma Case Shocking : జ‌స్టిస్ వ‌ర్మ‌పై ద‌ర్యాప్తు ప్యాన‌ల్ ఏర్పాటు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన స్పీక‌ర్

Hello Telugu - Justice Varma Case Shocking

Hello Telugu - Justice Varma Case Shocking

Justice Varma : ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన జస్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ నోట్ల క‌ట్ట‌ల ద‌గ్ధం కేసులో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు స్పీక‌ర్ ఓం బిర్లా. మంగ‌ళ‌వారం లోక్ స‌భ‌లో జ‌స్టిస్ వ‌ర్మ‌కు సంబంధించి ద‌ర్యాప్తు ప్యాన‌ల్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. జస్టిస్ వర్మపై (Justice Varma) వచ్చిన అభియోగాలు మామూలువి కావ‌ని, తీవ్రమైనవి కాబట్టి ఆయన తొలగింపు ప్రక్రియ ప్రారంభించాలని బిర్లా స్ప‌ష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ మేర‌కు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Justice Varma Case Updates

జ‌స్టిస్ వ‌ర్మ‌పై వచ్చిన అభియోగాలను దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జస్టిస్ వర్మపై వచ్చిన అభియోగాలు తీవ్రమైనవి కాబట్టి ఆయన తొలగింపు ప్రక్రియ ప్రారంభించాలని బిర్లా మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్యలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని స్పీకర్ ఏర్పాటు చేశారు. కమిటీ వీలైనంత త్వరగా తన నివేదికను సమర్పించాల‌ని ఆదేశించారు. విచారణ కమిటీ నివేదిక అందే వరకు ప్రతిపాదన (జస్టిస్ వర్మ తొలగింపు) పెండింగ్‌లో ఉంటుంద‌ని స్పీక‌ర్ ఓం బిర్లా స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని జ‌స్టిస్ వ‌ర్మ నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల క‌ట్ట‌లు దొరికాయి. కొన్నింటిని కాల్చి వేశారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

Also Read : CM Chandrababu Clear Instructions : అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు వేగవంతం చేయండి

Exit mobile version