CM Chandrababu : అమరావతి – దేశంలోనే ఏపీ రాజధాని అమరావతి రోల్ మోడల్ కావాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ. 81,317 కోట్ల మేర పనుల్ని సీఆర్డీఏ ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిందిని చెప్పారు.
CM Chandrababu Clear Instruction to Minister Narayana
రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు సీఎంకు వివరించారు అధికారులు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్ లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా పనుల ప్రగతిలో రాజీ పడకూడదన్నారు. అంతే కాకుండా నిర్దేశించిన ప్రకారం రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏ మాత్రం తేడా వచ్చినా తాను ఊరుకోబోనంటూ హెచ్చరించారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చంధంగా భూములు రైతులు ఇచ్చారని, వారికి నష్ట పరిహారం కూడా ఇచ్చామని చెప్పారు. ఈ సందర్బంగా వారిని అభించారు సీఎం చంద్రబాబు. ఇదే సమయంలో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలన్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తవుతే ఇబ్బందులంటూ ఉండవన్నారు.
Also Read : Donald Trump Shocking Comments : బంగారంపై ఎలాంటి సుంకాలు లేవంటున్న ట్రంప్
