హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) గుర్తు మీద పోటీ చేసి ఖైరతాబాద్ లో ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఉన్నట్టుండి అధికారంలో రాక పోయేసరికి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్ తక్షణమే రాజీనామా చేయాలని లేక పోతే తనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా పట్టించు కోలేదు. ఆపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు. నిన్న ఊహించని రీతిలో దానం నాగేందర్ విషయంలో హైకోర్టులో తీవ్ర వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. దీంతో త్వరలోనే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రావడం ఖచ్చితమని తేలి పోయింది.
ఈ తరుణంలో దానం నాగేందర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినా తను పోటీ చేసేందుకు అనర్హుడు అవుతాడు. ఇది చట్టం చెబుతుంది. దానం నాగేందర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. దీనిపై ఇవాళ స్పందించాడు మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీకి చెందిన గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డి. దానం విషయంలో న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యం విజయం సాధించిందని అన్నారు. స్పీకర్ నిర్ణయం అన్యాయమని కోర్టు తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు. మిగిలిన ఎమ్మెల్యేల కేసుల్లో కూడా ఇలాంటి తీర్పునే ఆశిస్తున్నామన్నారు మాజీ మంత్రి. ఉత్తమ్ మాటల వల్ల తెలంగాణకు శాశ్వత అన్యాయం జరగబోతోందని ఆవేదన చెందారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఒక్క లిఫ్ట్ కూడా నడపకుండా 83 టీఎంసీల నీటిని ఎలా వినియోగించారని ప్రశ్నించారు.
