అంద‌రి ఫోక‌స్ ఖైర‌తాబాద్ బై పోల్ పైనే..?

ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు దానంకు నో ఛాన్స్

hellotelugu-KhairatabadByPoll

హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పై అన‌ర్హ‌త వేటు వేసింది రాష్ట్ర హైకోర్టు. త‌ను బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోటీ చేశాడు. గెలిచాక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. దీనిని స‌వాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు త‌ను ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడు కాద‌ని సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దీంతో ఖైర‌తాబాద్ స్థానం ఖాళీ కానుంది. ఆరు నెల‌ల్లోపు బై పోల్ నిర్వ‌హించాల్సి ఉంది. దీంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా గతంలో ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని పేర్కొంటూ, ఇప్పుడు కూడా ఆ కోర్టు నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని BRS న్యాయ విభాగం బలంగా వాదిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆరు నెలల్లోనే ఉప ఎన్నికలు జరగడం ఖాయం.

ఒక్కసారి అనర్హతకు గురైతే ఆయన ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. అంటే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే, దానం పోటీలో ఉండరు. అప్పుడు, కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై చర్చ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ‘ఖైరతాబాద్ బ్రాండ్’ ఇమేజ్‌తో ఉన్న PJR కుమార్తెకు ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. PJRకున్న ప్రజాకర్షణ (charisma) ఆమెకు కలిసి వస్తుందనే నమ్మకం ఉండవచ్చు. మరోవైపు BRS నుంచి, MLC దాసోజు శ్రవణ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, PJR కుమారుడు విష్ణువ‌ర్ద‌న్ రెడ్డిని బరిలోకి దించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఎలాగూ అవకాశం లేదు కాబట్టి… PJR రాజకీయ వారసుడిగా విష్ణు BRS తరఫున పోటీలో నిలిచే అవకాశం ఉంది.

Exit mobile version