Supreme Court Warning : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్

సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్

Hello Telugu - Supreme Court Warning

Hello Telugu - Supreme Court Warning

Supreme Court : ఢిల్లీ – బీఆర్ఎస్ పార్టీపై గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. వీరి ఫిరాయింపు అప్ర‌జాస్వామిక‌మ‌ని , వెంట‌నే వారిపై వేటు వేయాల‌ని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై సుదీర్ఘ వాద‌న‌లు విన్న‌ది సీజేఐ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం. గురువారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. తాము నేరుగా ఎమ్మెల్యేల‌పై వేటు వేసేందుకు అధికారం లేద‌ని, అందుకే మూడు నెల‌ల‌లోపు అసెంబ్లీ స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వారిపై వేటు వేయాల‌ని ఆదేశిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇందుకు గాను గ‌డువు ఇచ్చామ‌న్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒకే చోటు ఏకంగా 10 చోట్ల బైపోల్స్ రానున్నాయ‌నేది తేలి పోయింది. ఈ తీర్పు ఒక ర‌కంగా పార్టీలు మారే ఎమ్మెల్యేల‌కు చెంప పెట్టు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Supreme Court of India Strong Warning

ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీజేఐ బీఆర్ గ‌వాయ్. రాజకీయ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వాటిని అరికట్టాలని ధర్మాసనం నొక్కి చెప్పింది. గత పార్లమెంటరీ చర్చలు, కిహోటో హోల్లోహన్ తీర్పును ఉటంకిస్తూ, స్పీకర్ అనర్హత పిటిషన్లను వెంటనే నిర్ణయించాలని, ఆలస్యం జరగకుండా ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు నవంబర్ 22, 2024 నాటి డివిజన్ బెంచ్ ఆదేశాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టి, అన్ని అనర్హత చర్యలను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను పొడిగించడానికి ఏ ఎమ్మెల్యేను అనుమతించరాదని, అలాంటిది ఏదైనా ప్రయత్నం చేస్తే స్పీకర్ నుండి ప్రతికూల నిర్ణయాలను ఆహ్వానించవచ్చని కూడా హెచ్చరించింది. దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుపై స్టే విధించింది.

Also Read : Venkaiah Naidu Alarming : వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి

Exit mobile version