ఆర్టీఈ అమ‌లుపై సుప్రీంకోర్టు సీరియ‌స్

కేంద్రం, రాష్ట్రాల‌కు నివేదిక ఇవ్వాలి

hellotelugu-SupremeCourt

న్యూఢిల్లీ : ప్ర‌తి ఒక్క‌రికీ నిర్బంధ విద్య‌ను అందించ‌డంలో కేంద్రం, రాష్ట్రాలు విఫ‌లం అవుతున్నాయంటూ భార‌త దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై సోమ‌వారం సీజేఐ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ చేపట్టింది. ఈ సంద‌ర్బంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆర్టీఈ ని ఏ మేర‌కు అమ‌లు చేస్తున్నార‌నే దానిపై త‌క్ష‌ణ‌మే నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది ధ‌ర్మాసనం. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీజేఐ. తాము నోటీసులు జారీ చేస్తున్నామని, ఈ విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను తప్పనిసరి చేసే ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖ‌లైంది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ , జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరిన పిఐఎల్ పిటిషనర్ హరిప్రియ పటేల్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా పిల్లలకు ప్రీ-ప్రైమరీ విద్యను అమలు చేయగలగడమే కీలక సమస్యలలో ఒకటని న్యాయవాది అన్నారు. అంతేకాకుండా, ఎప్పటికప్పుడు నవీకరించబడుతున్న జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలు అంశాన్ని కూడా లేవనెత్తారు. ఎన్‌ఈపీ అనేది విద్యా వ్యవస్థను మార్పు చేస్తూ, సౌలభ్యం, నైపుణ్యాభివృద్ధి, సంపూర్ణ అభ్యసనంపై దృష్టి సారించే ఒక సమగ్రమైన చట్రం అని పేర్కొన్నారు.

Exit mobile version