Jubilee Hills: హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక ఫలితంపైనే ఉంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఏకంగా రూ. 500 కోట్ల బెట్టింగ్ కూడా జరిగినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అధికార పార్టీకి చెందిన నవీన్ యాదవ్ బరిలో ఉండగా సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేసినా చివరి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారింది. బీజేపీ , ఎంఐఎం బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి. విచిత్రం ఏమిటంటే ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. రెండు సర్వే సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెబితే మిగతా సంస్థలన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ బోతోందని పేర్కొన్నాయి.
Jubilee Hills By Election Counting Updates
శుక్రవారం ఉదయం నుంచే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. ఓటు శాతం తక్కువగా నమోదైంది. ముస్లిం ఓటర్లు ఇక్కడ కీలకంగా మారనున్నారు. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ పెద్ద ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పోలింగ్ విషయానికి వస్తే కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. మొత్తం 10 రౌండ్స్ లో ఓట్లు లెక్కిస్తారు. 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ లో 42 ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట షేక్ పేట డివిజన్ కు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత వెంగళ్ రావు నగర్ , రహమత్ నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల లెక్కిస్తారు.
Also Read : K Kavitha Strong Demand : తొలగించిన ఆర్టీసీ కార్మికులను తీసుకోవాలి
