K Kavitha Strong Demand : తొల‌గించిన ఆర్టీసీ కార్మికుల‌ను తీసుకోవాలి

ఎండీని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ క‌విత

Hello Telugu - K Kavitha Strong Demand

Hello Telugu - K Kavitha Strong Demand

K Kavitha : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో అకార‌ణంగా తొల‌గించిన కార్మికుల‌ను తిరిగి తీసుకోవాల‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (K Kavitha) రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారితో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఆర్టీసీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. గ‌త‌ 2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు 1,300 మందిని డిస్మిస్ చేశారని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్బంగా తొల‌గించిన ప్ర‌తి ఒక్క‌రినీ తిరిగి తీసుకోవాల‌ని క‌విత కోరారు. వారందరికీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

K Kavitha Strong Demand for RTC Workers

దీనిపై స్పందించారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నాగిరెడ్డి. ఈ మేర‌కు పున‌రాలోచిస్తామ‌ని క‌విత‌కు తెలిపారు. ఎండీని క‌లిసి విన‌తిపత్రం ఇచ్చిన అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ఉద్యమంలో, పోరాటంలో, ఆందోళ‌న‌లో ముందు వ‌రుస‌లో నిలిచిన కార్మికుల‌లో ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది ఉన్నార‌ని చెప్పారు. గ‌త స‌ర్కార్ హ‌యాంలో వీరిని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామ‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగా మాత్ర‌మే చూసింద‌న్నారు. ఇప్ప‌టికే ప‌ని భారం పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. వెంట‌నే వారికి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని క‌విత కోరారు.

Also Read : Dasoju Sravan Kumar Shocking Comments : ఎన్ని అక్ర‌మాలు చేసినా ధ‌ర్మ‌మే గెలుస్తుంది

Exit mobile version