రాజా సాబ్ కోసం జియో హాట్ స్టార్ బిగ్ డీల్

సినీ వ‌ర్గాల‌లో పెద్ద ఎత్తున ప్ర‌చారం

hellotelugu-RajaSaabOTTDeal

హైద‌రాబాద్ : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాజా సాబ్. ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌న‌కున్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాజా సాబ్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డాయి దిగ్గ‌జ ఓటీటీ సంస్థ‌లు. చివ‌ర‌కు జియో హాట్ స్టార్ భారీ ధ‌ర‌కు డీల్ కుదుర్చుకున్న‌ట్లు పెద్ద ఎత్తున సినీ వ‌ర్గాల‌లో ప్రచారం జ‌రుగుతోంది. ఈ సినిమాను మ‌న‌సు పెట్టి తీశాడు మారుతి. గ‌తంలో త‌ను డిఫ‌రెంట్ క‌థ‌ల‌తో తెర‌కెక్కించిన మూవీస్ మంచి ఆద‌ర‌ణ పొందాయి. ప్ర‌ధానంగా క‌థ‌ను బ‌లంగా న‌మ్మే మారుతి ఈ సినిమాలో ల‌వ‌ర్ బాయ్ గా ప్ర‌భాస్ ను చూపిస్తుండ‌డంతో బిగ్ స‌ర్ ప్రైజ్ ఇస్తాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ సినిమా రాజా సాబ్ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. దీంతో అభిమానులు ఇప్ప‌టి నుంచే సంబురాలు చేసుకోవ‌డంలో మునిగి పోయారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి బిగ్ మార్కెట్ సంక్రాంతి. చాలా మంది టాప్ హీరోలంతా ఈ పండుగ‌ను ఎక్కువగా టార్గెట్ చేసుకుని రిలీజ్ చేసేందుకు ఇష్ట ప‌డ‌తారు. ఇక ఈసారి సంక్రాంతికి బిగ్ హీరోస్ ల మూవీస్ రానున్నాయి. దీంతో ప్రేక్ష‌కులకు ఫుల్ క‌నువిందు చేయ‌నున్నాయి. చిరంజీవి మూవీ కూడా రానుంది. అయితే రాజా సాబ్ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త్వ‌ర‌లో సినిమా రెండో సింగిల్ ను విడుద‌ల చేయ‌నున్నారు.

Exit mobile version